Dailyhunt
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

విపక్ష నేతలందరూ ఏకమై ఒక 'జాతీయ విపత్తును' నివారించారని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన సందేశంలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు.

చారిత్రాత్మక రోజు..

భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మరపురాని రోజని సీఎం అభివర్ణించారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంపై రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతే ఈ విజయాన్ని సాధించిందని తెలిపారు.

నల్ల బిల్లుల ఓటమి..

ఈ బిల్లులను 'నల్ల బిల్లులు'గా పేర్కొంటూ.. వీటిని ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ సాహసంతో నిలబడినందుకు విపక్ష కూటమిలోని మిత్రపక్షాల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరాటంలో అండగా నిలిచిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరినీ సీఎం రేవంత్ రెడ్డి పేరుపేరునా ప్రస్తావించారు. వీరిలో ఎం.కే. స్టాలిన్ తమిళనాడు (DMK), మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ (TMC), అఖిలేశ్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ (SP) శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), లాలు ప్రసాద్ యాదవ్ బిహార్ (RJD)హేమంత్ సోరెన్ జార్ఖండ్ (JMM), అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ (AAP)వీరితో పాటు ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులకు కూడా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పోషిస్తున్న క్రియాశీలక పాత్రను స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు వీగిపోవడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా విపక్షాలు భావిస్తున్నాయి. దక్షిణాది నుంచి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి మిత్రపక్షల నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడం శుభ పరిణామమని సీఎం అభిప్రాయపడ్డారు.

.

కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy