Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు అప్పగించే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయంపై మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) హర్షం వ్యక్తం చేశారు.

మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉందని కొనియాడారు. మహిళా సంఘాల సాధికారతకు సీఎం నిర్ణయం మరో ముందడుగని ప్రశంసించారు. ఈరోజు (గురువారం) సచివాలయంలో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు.

మహిళా సంఘాలకు మిల్లింగ్‌లో అవకాశం కల్పించినందుకు మహిళల తరుపున మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం నిల్వ కేంద్రాల ఏర్పాటుతో మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. మిల్లింగ్, ధాన్యం నిల్వ రంగాల్లో మహిళా సంఘాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సీఎం నిర్ణయంతో గ్రామీణ మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy