Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళ వేషంలో సీరియల్ కిల్లర్.. మారుమూల అడవులే అతడి అడ్రస్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్.. మారుమూల అడవులే అతడి అడ్రస్

ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్‌ దేశంలో ఓ సీరియల్ కిల్లర్ కొంతకాలంగా వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. అతడిని చాలామంది 'దోమ' అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఆ సీరియల్ కిల్లర్ అత్యంత బలహీనంగా ఉంటాడు.

గత మూడు నెలల్లో అతడు 16 హత్యలు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఆ సీరియల్ కిల్లర్ మారుమూల అడవుల్లో దాక్కునేవాడు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే తనను గుర్తుపట్టకూడదని అతడు మహిళ వేషం ధరించాడు. చూసేవారికి నమ్మకం రావడం కోసం చంకలో ఓ చంటిబిడ్డను కూడా వేసుకున్నాడు.

జోర్లాన్ లోపెస్ డా సిల్వా అనే వ్యక్తి కొన్ని నెలలుగా హత్యలకు పాల్పడుతున్నాడు. అడువుల్లో తిరుగుతూ పోలీసుల కళ్లు కప్పేవాడు. ఎలా అయినా అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. రెండు రోజులు అడవంతా గాలించారు. ఎట్టకేలకు డా సిల్వా పోలీసుల కంట పడ్డాడు. అతడి వేషం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ శిశువును ఎత్తుకుని మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ కనిపించాడు. అతణ్ని అదుపులోకి తీసుకోని పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు.

జోర్లాన్ లోపెస్ డా సిల్వా వరుస హత్యలు చేస్తున్నాడని, ఇప్పటివరకు 16 మందిని బలి తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. బలహీనంగా ఉన్న ఈ సీరియల్ కిల్లర్‌ను స్థానికులు దోమ అని పిలుస్తారని వివరించారు.

'నాకు 13 సంవత్సరాలున్నప్పుడే మొదటి హత్య చేశాను. అలాగే నేను కేవలం చెడ్డవాళ్లను, నేరస్థులనే చంపుతాను. మంచివాళ్ల జోలికిపోను' అని డా సిల్వా పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. సీరియల్ కిల్లర్ నేరస్థులను మాత్రమే హత్య చేస్తున్నాడనే వాదనకు ఆధారాలు లేవు. గతంలో డా సిల్వా ఇంకా ఏమైనా నేరాలు చేశాడా? అరెస్ట్ సమయంలో అతడి దగ్గర ఉన్న ఆ చంటి బిడ్డ ఎవరు? అనే కోణంలో విచారణ సాగుతోంది.

ఇవీ చదవండి

మహిళల డ్రెస్ వేసుకుని అర్ధరాత్రి స్కూటీ రైడ్.. చివరకు ఏం జరిగిందంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy