Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళల ఆసియాకప్‌ 2026: హాంకాంగ్‌ను ఓడించిన థాయ్‌లాండ్‌

మహిళల ఆసియాకప్‌ 2026: హాంకాంగ్‌ను ఓడించిన థాయ్‌లాండ్‌

స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ఆసియా కప్‌2026 ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ బోణీ కొట్టింది. తక్కువ స్కోరే నమోదైన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై థాయ్‌లాండ్ విజయం సాధించింది.

టాస్‌ ఓడిన థాయ్‌లాండ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.

థాయ్‌లాండ్ జట్టు కెప్టెన్ నరుమోల్‌ చైవాయి (31 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇక హాంకాంగ్‌ బౌలర్లలో మరీనా లాంప్లౌ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హాంకాంగ్‌ మహిళల జట్టు తడబడింది. ఒక దశలో 84/3తో పటిష్ఠ స్థితిలో కనిపించిన హాంకాంగ్‌ జట్టు... చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. కారీ చాన్‌ (28), యాస్మీన్‌ (28), మరీనా ( 22) పోరాడినా ఫలితం లేకపోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నరుమోల్ చైవాయి అందుకుంది. నేడు జరగనున్న మ్యాచ్‌లో యూఏఈతో శ్రీలంక తలపడనుంది.

strong>

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..

బిచ్చగత్తె ఇంట్లో 3.50 లక్షల నగదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy