Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మహిళలను అసభ్య మెసేజ్‌లు, వీడియోలతో వేధిస్తున్న నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: మహిళలకు అసభ్య మెసేజ్‌లు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్న నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజేష్ అనే వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజేష్ తరచూ ఫోన్లలో యువతులతో చాటింగ్ చేస్తూ అసభ్యకర వీడియోలు పంపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy