Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. వైసీపీకి మంత్రి ఆనం వార్నింగ్

మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. వైసీపీకి మంత్రి ఆనం వార్నింగ్

ప్రకాశం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramnarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో మహిళలను వైసీపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఈరోజు(గురువారం) ప్రకాశం జిల్లాలో మంత్రి ఆనం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల గురించి వైసీపీ నేతలు అవహేళనగా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. మహిళలను కించపరిస్తే ఏ పార్టీ మనుగడ సాధించలేదని చెప్పుకొచ్చారు.

రామరాజ్య స్థాపనకు ఎన్డీఏ కూటమి పనిచేస్తోంది..

తమ ప్రభుత్వంలో ఒకవైపు సంక్షేమాన్ని.. మరోవైపు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. రామరాజ్య స్థాపనకు ఎన్డీఏ కూటమి పనిచేస్తోందని పేర్కొన్నారు. జగన్ హయాంలో దైవానికి కూడా విలువ లేకుండా చేశారని ఆగ్రహించారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ అనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మంతో పాటు అన్ని మతాలకు సమానమైన ప్రాతిపదిక కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

హిందూ, ముస్లిం, క్రైస్తవులకు ప్రాధాన్యం..

హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం కల్పిస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు. ఏపీలో ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.50.45 కోట్లు కేటాయించామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30 ఆలయాల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 సెంట్ల భూమి ఉంటే ఆలయ నిర్మాణానికి రూ.30 లక్షలు ఇస్తామన్నారు. ప్రతి ప్రాంతంలో ఒక ఆలయం ఉండాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

.

సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy