తెలంగాణ తాజావార్తలు
మహిళలు డబ్బు సంపాదించాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: మహిళలు వివక్ష నుంచి బయట పడాలంటే కచ్చితంగా డబ్బులు సంపాదించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై పరిశ్రమలను విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళ పారిశ్రామికవేత్తలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడం ద్వారా 80 శాతం వరకు సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. కేవలం మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందని కవిత అన్నారు.
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నతంగా ఉండేందుకు ఇష్టపడే వారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కవిత అన్నారు. టీ ప్రైడ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు 45 శాతం మేరా సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు డిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
related stories
-
హోం ఆటోను ఢీ కొన్న కారు.. స్టూడెంట్ మృతి
-
మిథునం మిథునం - 11, ఏప్రియల్ 2021
-
విజయనగరం 45 సంవత్సరాలు దాటితే టీకా