Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలు స్వతంత్రంగా ఎదగాలి : రాహుల్ గాంధీ

మహిళలు స్వతంత్రంగా ఎదగాలి : రాహుల్ గాంధీ

మళప్పురం : మహిళలు స్వతంత్రంగా వ్యవహరించాలని, ఆర్థికంగా, మానసికంగా స్వావలంబన సాధించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. బుధవారం ఆయన విద్యార్థినులతో మాట్లాడుతూ, మహిళలు, బాలికలు సొంతంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలన్నారు. స్వతంత్రంగా వ్యవహరించడం చాలా ముఖ్యమని చెప్పారు. బాలికలు, మహిళలు స్వతంత్రులుగా ఉండటాన్ని సమాజం ఇష్టపడదన్నారు.

మరికొద్ది నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న కేరళలో రెండు రోజులపాటు పర్యటించేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. ఆయన బుధవారం వండూర్‌లో ప్రభుత్వ హయ్యర్ సెకండరీ వొకేషనల్ స్కూల్ విద్యార్థినులతో మాట్లాడారు.

బాలికలు, మహిళలు స్వతంత్రులుగా ఉండటాన్ని సమాజం ఇష్టపడదని, అందువల్ల బాలికలపై మరింత ఎక్కువ బాధ్యత ఉందని చెప్పారు.

బాలికలు స్వతంత్రులై, ఇతర బాలికలకు సహాయపడాలని అన్నారు. అణకువ, ఇతరులపట్ల గౌరవ భావం ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy