Dailyhunt
మహిళపై దంపతుల దాడి

మహిళపై దంపతుల దాడి

  • చంపేయమంటూ భర్తను ప్రోత్సహించిన భార్య

  • తప్పించుకున్న బాధితురాలు..

  • తీవ్రంగా గాయపడిన మహిళ

  • భార్యాభర్తలపై కేసు నమోదు

హైదరాబాద్: భార్యాభర్తలు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

'దాన్ని చంపేయ్‌ అంటూ..' ఆమె భర్తను ప్రోత్సహించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వారాసిగూడ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితురాలు కథనం ప్రకారం.. గంగపుత్రకాలనీకి చెందిన బాధితురాలు(29), అరవింద్‌ భార్యాభర్తలు. అరవింద్‌ నిత్యం మద్యం తాగి రాంనగర్‌లో ఉండే స్నేహితుడు రాజుతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు.

నాలుగురోజుల క్రితం బాధితురాలి తల్లి రాజుకు ఫోన్‌ చేసి నీవల్లే అరవింద్‌ చెడువ్యసనాల బారిన పడుతున్నాడని, నిత్యం తాగి వచ్చి భార్యను కొడుతున్నాడని దూషించింది. ఈ విషయాన్ని రాజు తనభార్య సింధూకు చెప్పాడు. దీంతో ఆమె బాధితురాలికి ఫోన్‌ చేసి బెదిరించింది. ఫోన్‌లో ఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సింధూ తనభర్త రాజును తీసుకుని గురువారం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను దూషించారు. అంతటితో ఆగని రాజు ఆమెను కాలితో తన్ని తీవ్రగాయాలపాలు చేశాడు.

 సింధూ ఆమె జట్టు పట్టుకుని కొట్టడంతో పాటు చంపేయ్‌ అంటూ భర్తను ప్రోత్సహించింది. దీంతో రాజు అఘాయిత్యానికి పాల్పడగా ఆమె తప్పించుకుని బయటకు పరుగుతీసింది. దీంతో దంపతులిద్దరూ అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటన అంతా బాధితురాలి పిల్లల ముందు జరగటంతో వారు భయాభ్రాంతులకు గురయ్యారు. ఈ దాడి ఘటనకు సంబంధించి గురువారం రాత్రి బాధితురాలు వారాసిగూడ పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బంగారం ఎత్తుకెళ్లాడు..

అకారణంగా తనపై రాజు, సింధూ దాడిచేసి విపరీతంగా కొట్టారని బాధితురాలు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపింది. రాజు మాట విని తన భర్త తనను విపరీతంగా కొట్టేవాడని, అంతేకాకుండా అల్మారాలో ఉన్న పదితులాల పైనే ఉన్న బంగారు నగలను ఎత్తుకు పోయాడని బాధితురాలు ఆరోపించింది. అయితే, బాధితురాలిపై దాడి జరగటం వాస్తవమేనని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రామచంద్రారెడ్డి తెలిపారు. కులంపేరుతో తమను దూషించిందని నిందితులు ముందుగానే ఆమెపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని తెలిపారు.

/span>

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పాత పేరు.. కొత్త అజెండా!

Read Latest Telangana Newsand National News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy