Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్‌తో యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు

మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్‌తో యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు

ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలు భారత్‌లోని ఇన్‌స్టా అకౌంట్స్‌లో కనిపించాయన్న వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది.

ఈ ఘటనపై వివరణ కోరుతూ మెటాకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలను ఎలా అనుమతించారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇలాంటి యాడ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ఏం చర్యలు తీసుకున్నదీ చెప్పాలని కూడా ఆదేశించింది.

ఈ ఉదంతంపై బీబీసీ తొలుత ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌ విక్రయాలకు సంబంధించి యాడ్స్‌ భారత్‌లోని ఇన్‌స్టా అకౌంట్స్‌లో కనిపించాయంటూ ఒక పరిశోధాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ యాడ్స్‌ పలు టెలిగ్రామ్ ఛాన్సల్స్‌కు సంబంధించినవని పేర్కొంది. కేవలం రూ.99లకే కంటెంట్ లభిస్తుందంటూ యాడ్స్ ఉన్నాయని పేర్కొంది.

ఈ కథనంపై ఇన్‌స్టాగ్రామ్ 24 గంటల తరువాత స్పందించిందని బీబీసీ పేర్కొంది. అకౌంట్స్‌ను సస్పెండ్ చేశామని తెలిపినట్టు పేర్కొంది. దీంతో, ఈ ఉదంతంపై వివరణ కోరుతూ కేంద్రం కూడా మెటాకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy