Dailyhunt

మళ్లీ.. కళకళలాడుతున్న విమానాశ్రయం

శంషాబాద్‌ రూరల్‌/హైదరాబాద్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సడలింపులతో శంషాబాద్‌ విమానాశ్రయం మళ్లీ ప్రయాణికులతో కళకళలాడుతోంది. ఇప్పటి వరకూ దాదాపు 1.10లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజూ 230 సర్వీసుల ద్వారా 20వేలకు పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళుతున్నారని వెల్లడించారు. అబుదాబి, మస్కట్‌, షార్జా, దుబాయ్‌, లండన్‌, కువైట్‌, బర్మా, దోహలతో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా విమానాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు.

త్వరలో మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. కాగా, ఎంపిక చేసిన ఎయిరిండియా, ఇండిగో విమానాల్లో ఈ-బోర్డింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో బోర్డింగ్‌ పాస్‌ కోసం క్యూ లైనులో నుంచునే ఇబ్బంది తప్పింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy