Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్ళీ మాదే అధికారం, అందుకే మరో ఐదేళ్ళకు ప్రణాళిక సిద్ధం : యోగి ఆదిత్యనాథ్

మళ్ళీ మాదే అధికారం, అందుకే మరో ఐదేళ్ళకు ప్రణాళిక సిద్ధం : యోగి ఆదిత్యనాథ్

లక్నో : భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పని తీరును ప్రజలు మెచ్చుకుంటున్నారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 2022లో జరిగే శాసన సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అందుకే మరో ఐదేళ్ళకు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన రైజింగ్ ఉత్తర ప్రదేశ్, 2021 కార్యక్రమంలో బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత నాలుగేళ్ళలో తన ప్రభుత్వం 4 లక్షల ఉద్యోగాలను ఇచ్చినట్లు యోగి తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

యూపీ ఫిలిం సిటీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, తాము ఎవరినీ బెదిరించడం లేదన్నారు. విధానాలకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత, రక్షణ కల్పించడంలో విఫలమైందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో అధోజగత్తు డాన్‌లు ఎవరూ క్రియాశీలంగా లేరన్నారు.

నేరస్థులను తాము ఎక్కడ ఉంచుతామో అందరికీ తెలుసునన్నారు. గూండాల పన్నును ఉత్తర ప్రదేశ్‌లో వసూలు చేయరన్నారు. నేరస్థులకు రాష్ట్రంలో చోటు లేదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy