జాతీయం-అంతర్జాతీయం
మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం ఉద్ధవ్

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బుధవారం మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు చివరి తీర్పు ఇచ్చే వరకూ కేంద్రం ఈ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగిన వివాదంపై ఓ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం ఉద్ధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉందని సీఎం ఉద్ధవ్ నొక్కి వక్కానించారు.
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను ఎప్పటికైనా మహారాష్ట్రలో తిరిగి కలుపుకుంటామని కొన్ని రోజుల క్రితం సీఎం ఉద్ధవ్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే దీనికి కర్నాటక సీఎం యడియూరప్ప కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. ఉద్ధవ్ మాటలు సమాఖ్య వ్యవస్థకే విరుద్ధమని యడియూరప్ప పేర్కొన్నారు.
related stories
-
జాతీయం-అంతర్జాతీయం 'లెఫ్ట్' ఆశలను 'యంగ్ జనరేషన్' నెరవేరుస్తుందా?
-
హెరాల్డ్ కార్డ్స్ నందిగ్రామ్ బరిలో దీదీ
-
జాతీయం రాహుల్ గాంధీ కి షాక్...!