జాతీయం-అంతర్జాతీయం
మమతను అవమానించేందుకే ఆ స్లోగన్లు: అధీర్ రంజన్

న్యూఢిల్లీ: కోల్‌కతాలో జరిగిన 'పరాక్రమ్ దివస్'లో రాముడి నినాదాలు చేయకుండా ఉండాల్సిందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అమానించేందుకే ఈ ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఆ పదవికి తగిన గౌరవం ఇవ్వాలి' అని అన్నారు.
ప్రధాని మోదీ, మమతా బెనర్జీ పాల్గొన్న కార్యక్రమంలో మమతను మాట్లాడాల్సిందిగా ఆహ్వానించినపుడు కొందరు 'జై శ్రీరామ్ నినాదాలు' చేయడంతో మమత అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదనీ, ప్రభుత్వ కార్యక్రమం అని, హుందాగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఆహ్వానించి అవమానించడం తగదన్నారు. తాను ప్రసంగించడం లేదంటూ ముగించేశారు.
ఈ ఘటనపై అధీర్ రంజన్ తన స్పందన తెలియజేస్తూ, జై శ్రీరామ్ నినాదాలివ్వడం వెనుక రాముడితో తమకున్న అనుబంధం చెప్పుకునే ఉద్దేశాలు లేవని, మమతా బెనర్జీని అవమాన పరచేందుకే వారు ప్రయత్నించారని అన్నారు. దీనిని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. మమతా బెనర్జీతో తనకు రాజకీయ విభేదాలున్నప్పటికీ ఆమె పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అని, అధికారిక కార్యక్రమాల్లో ఆమెను అవమానపరుస్తున్నారని అన్నారు.
related stories
-
జాతీయం-అంతర్జాతీయం విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్
-
తాజావార్తలు ప్రగ్యా ఠాకూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
తాజా వార్తలు Sex Scandals: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్స్.. కన్నడ నాట మరీ...