Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mancherial: గూడెంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు

Mancherial: గూడెంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు

దండేపల్లి, నవంబరు 24 (ఆంధ్ర జ్యోతి): కార్తీకపౌర్ఱమి సందర్బంగా దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్నిఏర్పాట్లు చేసి నట్లు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ తెలి పారు.

మంగళవారం ఆయన సతీ సమేతంగా స్వామివారిని దర్శించు కొని ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి, వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గూడెం కార్తీకపౌర్ణమి జాతర సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్‌, విద్యుత్‌ దీపాలంకరణ, క్యూలైన్ల, పోలీసు బందోబస్తు వంటి సదుపాయాలు కల్పించినట్లుపేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వ యంతో భక్తులకు మెరుగైనసౌకర్యాలు కల్పిస్తున్నా మని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాం క్షించారు. ఆయనవెంట వివిధశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన సీపీ ..

దండేపల్లి/మంచిర్యాలక్రైం : కార్తీకపౌర్ణమి సందర్భంగా గూడెంలో శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న జాతరకు పటిష్ట పోలీసు భధ్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా పేర్కొన్నారు. మంగ ళవారం ఆయన ఆలయంతోపాటు గోదావరి తీరాన్ని సందర్శించి ఘాట్‌వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ సదుపాయాలు కల్పించిన తీరును పరిశీలించారు. గోదావరి ఘాట్‌ వద్ద ప్రమాదాల నివారణకు బారికెడ్లు ఏర్పాటు చేయడం తోపాటు గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్దులు భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని, నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకు నేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

అనంతరం గూడెం సత్యదేవుడి ఆలయాన్ని సందర్శించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయనవెంట మంచిర్యాల ఏసీపీ ఆర్‌ ప్రకాష్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, సీఐ రమణమర్తి, ఎస్సైలు రాజవర్థన్‌, సురేష్‌, ఉదయ్‌కిరణ్‌ ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy