నరసన్నపేట, జూలై 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని రెడ్డికిపేట సమీపం లోని మంగమ్మ చెరువుకు గురువారం గండిపడింది. చెరువుగట్టు కోతకు గురి కావడంతో గండిపడి నీరు వృథాగాపోతోంది.
చెరువుకింద 60 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. దీంతో వరి సాగుకు ఇబ్బందులు వస్తాయని, తక్షణమే గండిని పూడ్చివేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

