Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మనీలాండరింగ్ కేసులో కేరళ మాజీమంత్రికి ఈడీ సమన్లు

మనీలాండరింగ్ కేసులో కేరళ మాజీమంత్రికి ఈడీ సమన్లు

కొచ్చి (కేరళ): కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఇండియన్ యూనియన్ ముస్లీంలీగ్ నాయకుడిపై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించింది. మనీలాండరింగ్ కేసులో కేరళ మాజీమంత్రి, ఎమ్మెల్యే వీకే ఇబ్రహీం కుంజూకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో మార్చి 22వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లలో ఎమ్మెల్యే ఇబ్రహీంను ఆదేశించింది. ఆదాయం,ఆస్తుల వివరాలను సమర్పించాలని ఈడీ ఎమ్మెల్యేను ఆదేశించింది. 2016వ సంవత్సరంలో ఇండియన్ యూనియన్ ముస్లిమ్ లీగ్ మౌత్ పీస్ అయిన చంద్రిక దినపత్రికకు రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.10కోట్లను బదిలీ చేశారు. దీంతో నగదు బదిలీల సమాచారంతోపాటు ఆస్తులు, ఆదాయ వివరాలను తమ పరీశీలన కోసం సమర్పించాలని ఈడీ ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy