Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి నారా లోకేశ్‌ రాక

మంత్రి నారా లోకేశ్‌ రాక

విశాఖపట్నం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ గురువారం రాత్రి నగరంలోని ఆర్కే బీచ్‌రోడ్డులో గల ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె అస్మితానాయుడు వివాహానికి హాజరయ్యారు.

విజయవాడ నుంచి విమానంలో భోగాపురం చేరుకున్న ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్‌రాజు, కార్పొరేషన్‌ చైర్మన్లు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్‌, డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తదితరులు స్వాగతం పలికారు. భోగాపురం నుంచి రోడ్డుమార్గాన ఎంపీ శ్రీభరత్‌తో కలిసి కళ్యాణవేదిక వద్దకు రాగా ఎమ్మెల్యే లలితకుమారి, ఆమె భర్త రాంప్రసాద్‌ తదితరులు స్వాగతం పలికారు. వధూవరులను లోకేశ్‌ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వివాహ వేదిక వద్ద తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తదితరులు కలిశారు.

కాగా విశాఖ విమానాశ్రయంలో పనిచేసి, ఇప్పుడు ఉపాధి కోల్పోయిన పలువురు మంత్రి వస్తున్న విషయం తెలుసుకుని కన్వెన్షన్‌ సెంటర్‌ బయట ప్లకార్డులు పట్టుకుని నిల్చున్నారు. ఆందోళన చేస్తున్న వారిలో ఒక మహిళను వివాహ వేదిక ప్రాంగణానికి పిలిపించి మంత్రి లోకేశ్‌ మాట్లాడారు. సమస్య తెలుసుకున్నారు. అనంతరం భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడ బయలుదేరి వెళ్లారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy