Dailyhunt
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో (Minister Sridhar Babu) నార్వే ప్రతినిధులు ఈరోజు (మంగళవారం) సచివాలయంలో భేటీ అయ్యారు.

మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలో హై లెవల్ డెలిగేషన్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రితో వారు చర్చించారు. 'తెలంగాణ-నార్వే' ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చలు జరిగాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్డడం కోసం నార్వే కంపెనీలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు.

లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూల విధానాలు ఉన్నాయని తెలిపారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఏఐ, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్ రంగాల్లో కలసి పని చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. 'తెలంగాణ-నార్వే వర్కింగ్ గ్రూప్' ఏర్పాటు ప్రతిపాదనపై కూడా చర్చించారు. పెట్టుబడులకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి నార్వే సిద్ధమని రాయబారి వెల్లడించారు.

.

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy