
అమరావతి: మంత్రి ఆదిమూలపు సురేష్‌కి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మీరు మొండిగా నిర్వహిస్తామంటున్న పరీక్షలు... పాస్, ఫెయిల్ నిర్ణయించేవి కాదన్నారు. లక్షలాది విద్యార్థుల ప్రాణాలకు విషమ పరీక్ష అని మండిపడ్డారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని సీఎంకు లేఖ రాశానని తెలిపారు. లేఖ రాసిన తర్వాతే పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించారని, అందుకే మూర్ఖపురెడ్డి అని సంబోధించాల్సి వచ్చిందన్నారు. తనను మీ నోటికొచ్చినట్టు మరో అరగంట తిట్టండి... కానీ పరీక్షలు మాత్రం రద్దు చేసి విద్యార్థుల్ని కాపాడండని సూచించారు. తన విదేశీ చదువు, ఫీజుల గురించి మీకు వివరాలు పంపుతానని తెలిపారు. మీరు బాగా చదువుకున్నవారే కాబట్టి అవి మీకు అర్థమై..మళ్లీ తాడేపల్లి కాంపౌండ్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్‌తో ఆరోపణలు చేయరని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటాడో... పరీక్షలు పెట్టి కంసుడు లాంటి మేనమామ అవుతాడో మీ మూర్ఖపురెడ్డి ఇష్టమన్నారు.