మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

1901d

Loading...

పంజాబ్‌లో 53వేల కోళ్ల వధ

చండీగఢ్‌, జనవరి 21: బర్డ్‌ఫ్లూ విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. వేలాది పక్షుల ప్రాణాలను తీస్తూనే ఉంది. పంజాబ్‌లోని మొహాలీ పరిధిలోని బెహ్రా సమీపంలోని రెండు పౌలీట్రీ ఫాంలలోని కోళ్లకు వైరస్‌ సోకింది. దీంతో 53వేల కోళ్లను వధించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో మరిన్ని ప్రాంతాలకు బర్డ్‌ఫ్లూ వ్యాపించిందని కేంద్రం వెల్లడించింది. వైరస్‌ కోరల్లో ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు చిక్కుకున్నాయి.

Your Reaction?

1
1
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy