Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి ఆసక్తికర ట్వీట్స్‌తో అలరించిన చిరు, మోహన్‌బాబు

మరోసారి ఆసక్తికర ట్వీట్స్‌తో అలరించిన చిరు, మోహన్‌బాబు

చిరు ట్విట్టర్ ఎంట్రీ సందర్భంగా మోహన్ బాబు మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి చిరు.. 'ధన్యవాదాలు మిత్రమా.. రాననుకున్నావా.. రాలేననుకున్నావా..?' అంటూ చమత్కరించారు. దీనికి మోహన్ బాబు కూడా అంతే చమత్కారంగా సమాధానం ఇచ్చారు. 'ఆ విషయం ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను..' అంటూ మోహన్ బాబు ఇచ్చిన సమాధానంతో వీరిద్దరూ కరోనా సమయంలో అందరినీ చక్కగా అలరిస్తున్నారని అంతా అనుకున్నారు.

తాజాగా చిరంజీవి.. మోహన్ బాబు ఇచ్చిన 'హగ్' రిప్లయ్‌కి సమాధానమిచ్చారు. ''మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి. నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్..

ఓన్లీ నమస్తే. సామాజిక దూరం తప్పనిసరి. ఇంకా.. మనకు దగ్గరగా ఉండేవారి నుంచి, మన బంధువుల నుంచి ఎలా రక్షణ పొందాలో మన మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు..'' అని చిరు ట్వీట్ చేయగా.. దీనికీ మోహన్ బాబు స్పందించారు. ''మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం..'' అని మోహన్‌బాబు ఇచ్చిన రిప్లయ్ చూసిన నెటిజన్లు.. 'ఇలాంటి ట్వీట్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy