దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి (Petrol price hike). గత కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న పెంపుల్లో భాగంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి తాజాగా ధరలను సవరించాయి.
లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున ప్రభుత్వ రంగ సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈరోజు (సోమవారం) ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి వచ్చాయి (Diesel price increase). ఇప్పటికే మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.73కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.103.82కు చేరుకుంది. మరోవైపు విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.75కి, లీటర్ డీజిల్ ధర రూ.105.43కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, లీటర్ డీజిల్ ధర రూ.95.20కి చేరుకుంది.

