Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పాటు

మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పాటు

సిరిసిల్ల/కరీంనగర్‌ రూరల్‌ : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్‌మానేరు ప్రాజెక్టులో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి 28లక్షల 50వేల చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం డ్యామ్‌ నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ సంతరించుకున్న రిజర్వాయర్‌ను చూస్తే సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 80 కోట్ల చేప పిల్లలు, ఐదు కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌, అంతర్జాతీయ మార్కెట్లకు చేపలను ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

కాగా, కరీంనగర్‌లోని పద్మనగర్‌లో ఆంబోతుల వీర్య ఉత్పత్తి కేంద్రంలో ఘనీకృత వీర్య నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలను మంత్రి తలసాని ప్రారంభించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy