మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
టిప్పర్ ఢీకొని స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. స్కూటీపై వెళ్తున్న యువతి దీప్సిక (19), యువకుడు అమర్దొయ (15)ను టిప్పర్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
వినాయక మండపం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..

