చెన్నై : వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తాత కూడా మృతి చెందాడు. వలసరవాక్కం సమీపంలోని రామాపురం కన్నదాసన్‌నగర్‌కు చెందిన నందగోపాల్ కుమారుడు ఆకాష్(22) చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులకు ఆకాష్ హాజరవుతున్నాడు. అయితే తన గదిలోకి వెళ్లిన ఆకాష్ ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో సందేహించిన తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూడగా ఆకాష్ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. సమాచారం అందుకున్న రాయలానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

