Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేము లేకుండా యూఎస్ చంద్రుణ్ణి చేరుకోలేదు: జర్మనీ మంత్రి

మేము లేకుండా యూఎస్ చంద్రుణ్ణి చేరుకోలేదు: జర్మనీ మంత్రి

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్స్‌ ఇతర దేశాలకు అందకుండా అమెరికా ప్రభుత్వం నిషేధించడంపై ఐరోపాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ఏఐ రంగంలో సార్వభౌమత్వం సాధించాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ అంతరిక్ష పరిశోధన శాఖ మంత్రి డొరొతీ బార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఐరోపా, జర్మనీ అందించే సాంకేతికతలు కీలకమని గుర్తు చేశారు.

'మేము లేకపోతే నాసా స్పేస్ మిషన్లు సాధ్యం కాదు. ఐరోపా సర్వీస్ మాడ్యుల్ లేకుండా నాసా చంద్రుడిని చేరలేదు' అని ఇటీవల వీవాటెక్ ట్రేడ్ షో సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం మరో కూటమి కూడా ఏర్పాటైందని మంత్రి డొరొతీ పేర్కొన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు అంతరిక్ష రంగంలో ఐరోపాను అధిగమించకూడదని స్పష్టం చేశారు.

అమెరికా టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఐరోపా సమాఖ్య భావిస్తోంది. సెమీ కండక్టర్లు మొదలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ వరకూ వివిధ రంగాల్లో స్వదేశీ సంస్థల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందుకోసం ఒక వ్యూహాన్ని కూడా రూపొందించుకుంది. ఆర్థికంగా, రాజకీయంగా తాము కోల్పోయిన ప్రాభవాన్ని మళ్లీ దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఐరోపా, అమెరికా మధ్య విభేదాలు పెరిగితే అధ్యక్షుడు ట్రంప్ క్రిటికల్ సాంకేతికతలపై నిషేధం విధించవచ్చని ఐరోపాలో ఎప్పటినుంచో భయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఆంథ్రోపిక్ ఏఐ మోడల్స్‌పై యూఎస్ నిషేధంతో ఐరోపా అప్రమత్తమైంది.

ఈ వార్తలనూ చదవండి:

పౌరసత్వ దరఖాస్తు ఫీజులను పెంచనున్న యూఎస్! ఏకంగా 75 శాతం..

పాకిస్థాన్, ఖతార్‌లపై విరుచుకుపడిన అమెరికా సెనేటర్లు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy