Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

ఇంటర్నెట్ డెస్క్: బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా స్టార్ ఫార్వర్డ్ స్ట్రైకర్ ఫొలారిన్ బలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డు చూపించడంపై వివాదం మొదలైంది.

ప్రత్యర్థి ఆటగాడిపై చేసిన టాకిల్‌ను పరిశీలించిన రిఫరీ బలోగన్‌కు రెడ్ కార్డు చూపించారు. దీంతో అమెరికా జట్టు పదిమందితోనే మ్యాచ్ పూర్తి చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ అమెరికా 2-0తో విజయం సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. అయితే ఈ రెడ్ కార్డు నిర్ణయంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు (Balogun Red Card).

ఈ టోర్నీలో ఒక మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) కూడా దాదాపు ఇదే తరహాలో ప్రత్యర్థి ఆటగాడిని టాకిల్ చేశాడు. అయితే మెస్సీకి రిఫరీ ఎలాంటి శిక్షనూ విధించలేదు. అదే తరహా ఘటనలో బలోగన్‌కు మాత్రం రెడ్ కార్డు చూపించడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రముఖ ఫుట్‌బాల్ విశ్లేషకులు కూడా ఈ నిర్ణయం చాలా కఠినంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. అందరికీ ఒకే తరహా నిబంధనలు ఉండాలని, స్టార్ ఆటగాళ్లకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకూడదని అభిమానులు పోస్టులు పెడుతున్నారు (VAR Controversy).

బలోగన్‌కు రెడ్ కార్డు పడటంతో అతడు తదుపరి నాకౌట్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు (FIFA World Cup 2026). ఇది అమెరికా జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారింది. ఏదేమైనా, ఫిఫా రిఫరీల నిర్ణయాలపై మరోసారి చర్చ మొదలైంది. టోర్నమెంట్‌లో ఒకే తరహా ఫౌల్స్‌కు వేర్వేరు నిర్ణయాలు రావడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy