Dailyhunt
మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురైందో లేదో ఇలా తెలుసుకోండి..

మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురైందో లేదో ఇలా తెలుసుకోండి..

ఇంటర్నెట్ డెస్క్: మన శరీరానికి నీరు చాలా అవసరం. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, కణాలకు పోషకాలను అందించడంలో, విష పదార్థాలను తొలగించడంలో సాయపడుతుంది.

అలాగే జీర్ణక్రియ, రక్తప్రసరణ, కీళ్లు సక్రమంగా పనిచేయడంలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలోని సగం కంటే ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. అందువల్ల నీటి కొరత ఆరోగ్యంరై నేరుగా ప్రభావం చూపుతుంది.

కారణాలివే..

శరీరం తీసుకునే ద్రవాల కంటే కోల్పోయే ద్రవాలు(నీరు, లవణాలు) ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్(నిర్జలీకరణం) వస్తుంది. దీనికి ప్రధాన కారణాలు.. తగినంత నీరు తాగకపోవడం, అతిసారం(డయేరియా), వాంతులు, అధిక జ్వరం, ఎక్కువగా చెమట పట్టడం(ఎండలో పనిచేయడం/వ్యాయామం), మూత్ర విసర్జనను పెంచే మందులు వాడటం.

లక్షణాలు..

డీహైడ్రేషన్ అంటే శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ నీరు అందడం. దీని ప్రధాన లక్షణాలు తీవ్రమైన దాహం, మూత్రం తక్కువగా రావడం, అలసట, చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపించడం, మైకం, నోరు పొడిబారడం, తలనొప్పి, కన్ఫ్యూజన్, వేగవంతమైన హృదయ స్పందన వంటి సమస్యలు వస్తాయి.

నీటి కొరత వల్ల వచ్చే సమస్యలు

  • మూత్రపిండ సమస్యలు

  • మలబద్ధకం

  • తక్కువ రక్తపోటు

  • ఎలక్ట్రోలైట్ అసమతుల్యత

  • తీవ్రమైన సందర్భాల్లో వడదెబ్బ, మూర్ఛ, బలహీనత

నివారణ మార్గాలు..

  • రోజూ తగినంత నీరు తాగాలి, దాహం వచ్చే వరకు వేచి ఉండకూడదు.

  • వేడి లేదా వ్యాయామ సమయంలో ఎక్కువ ద్రవం తీసుకోవాలి.

  • కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి డ్రింక్స్ తాగాలి.

  • ఎక్కువ టీ, కాఫీ, ఆల్కహాల్‌ తాగకూడదు.

  • సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy