Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిడతల దాడులు జరగొచ్చు.. 15లక్షలమంది రైతులకు హెచ్చరికలు!

మిడతల దాడులు జరగొచ్చు.. 15లక్షలమంది రైతులకు హెచ్చరికలు!

భువనేశ్వర్: దేశంలో అన్నదాతల పాలిట భూతంలా మారిన మిడతల దాడుల గురించి రైతులకు ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిసాలో సుమారు 15 లక్షల మంది రైతులకు తాము హెచ్చరికలు పంపామని అధికారులు మంగళవారం వెల్లడించారు. వీరిలో దాదాపు 6.5 లక్షల మందికి వాట్సాప్ మెసేజిలు పంపామని, 8లక్షలమందికిపైగా నేరుగా మెసేజిల ద్వారా హెచ్చరికలు చేశామని వారు చెప్పారు. రాష్ట్రంలోని సుమారు 9జిల్లాల్లోని పొలాలపై మిడతల దాడి జరగవచ్చని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో రానున్న 10రోజుల్లో అప్రమత్తంగా ఉండాలనే ఇలా హెచ్చరికలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy