Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) దాఖలు చేశారు.

దీనిని ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. ఈ నామినేషన్ తిరస్కరణను సీఎం తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని ఆరోపించారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి బీజేపీ పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.

ఈమేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు పెట్టారు. జైరాం రమేశ్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ఆగ్రహించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ఇలా చేయడం ప్రజల గొంతులను అణచివేయడమేనని సీఎం చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పౌరులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని… న్యాయం జరిగే వరకు పోరాడుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

.

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy