Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ యత్నం

హైదరాబాద్: డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రవాణా, వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మినిస్టర్స్ క్వాటర్స్ ముట్టడికి యత్నించారు. లోనికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలన పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా యూజీసీ మార్గనిర్దేశకాలు పాటించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నీ ఒక సమూహంగా ఏర్పడి తెలంగాణను ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని ఉమ్మడి పరీక్షలు నిర్వహించాలన్నారు. స్థానికంగా ఉన్న యూనివర్సిటీ పరిధిలో పరీక్ష రాసుకొనే వెసులుబాటు కల్పించి, రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు.

అవకాశమున్న సబ్జెక్ట్స్‌లో 2 పేపర్స్ ఉన్న పరీక్షను కలిపి ఒకే పరీక్షగా మార్చి పరీక్షల సంఖ్యను, పరీక్ష సమయాన్ని కుదించాలని పట్టుబట్టారు. కరోనా లక్షణాలున్న అభ్యర్థులకు ప్రత్యేక గదులు కేటాయించి పరిక్షలు నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy