Dailyhunt
మోదీ - బైడెన్‌లతో అక్కడ ఎవరెవరున్నారంటే....

మోదీ - బైడెన్‌లతో అక్కడ ఎవరెవరున్నారంటే....

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి సమావేశంలో ఆ దేశ సెక్రటరీ ఫర్ డిఫెన్స్ జనరల్ లాయిడ్ ఆస్టిన్ పాల్గొనకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

మోదీతోపాటు పాల్గొన్న భారత బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ తదితరులు ఉన్నారు. అమెరికన్ బృందంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, ఎన్ఎస్ఏ జేక్ సులివన్ ఉన్నారు.

మోదీతోపాటు సమావేశంలో పాల్గొన్నవారిలో విదేశాంగ శాఖ కార్యదర్శి అంబాసిడర్ హర్షవర్ధన్ శృంగ్లా, అంబాసిడర్ తరన్‌జిత్ సింగ్ సంధు, ప్రధాన మంత్రికి సంయుక్త కార్యదర్శి రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్, మోదీ ప్రైవేటు కార్యదర్శి వివేక్ కుమార్ ఉన్నారు.

బైడెన్‌తోపాటు పాల్గొన్నవారిలో స్పెషల్ ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్ ఫర్ క్లైమేట్ జాన్ ఎఫ్ కెర్రీ, అధ్యక్షునికి డిప్యూటీ అసిస్టెంట్, జాతీయ భద్రతా మండలిలో ఇండో-పసిఫిక్ వ్యవహారాల సమన్వయకర్త కుర్ట్ కాంప్‌బెల్, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లు, అధ్యక్షునికి స్పెషల్ అసిస్టెంట్, ఎన్ఎస్‌సీలో దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ డైరెక్టర్ సుమొన గుహ ఉన్నారు.

ఈ చర్చలో పాల్గొన్నవారిలో అతి పిన్న వయస్కుడు 44 ఏళ్ళ జేక్ సులివన్. మరోవైపు సుమొన గుహ (49) అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో 20 ఏళ్ళకుపైగా అనుభవంగల ఇండియన్ అమెరికన్.

 Indiaలో 25,072 కొత్త కరోనా కేసులు నమోదు  జీవితాంతం గుర్తుండిపోయేలా భారీ ఓటమిని వాళ్లకు గిఫ్ట్‌గా ఇస్తా.. ట్రంప్ కామెంట్స్  ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి: అసదుద్దీన్ ఓవైసీ  90 నిమిషాలు.. 6 అంశాలు.. ట్రంప్, బైడెన్.. ఎవరేం చెప్పారు..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy