Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

ఢిల్లీ, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు.

'గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పిస్తే.. మోదీ 'ఓటు రద్దు' కుట్రలతో లాక్కుంటున్నారని ఆగ్రహించారు. ఈరోజు (మంగళవారం) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై నేతలతో ఖర్గే చర్చించారు. ఈసీఐ తీరును తప్పుబడుతూ ఈ సమావేశంలో ఐదు కీలక డిమాండ్లపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌పై ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మగా ప్రధాన ఎన్నికల కమిషనర్ మారారని మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధి పోరాటాల నుంచి పార్లమెంట్ వరకు తాము పోరాడతామని స్పష్టంచేశారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్య పునాదులను కుట్రపూరితంగా డొల్లగా మార్చేశారని దుయ్యబట్టారు. సీఈసీ మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. పదేళ్ల క్రితం 'నోట్ల రద్దు'తో ఆర్థిక వ్యవస్థను, ఇప్పుడు 'ఓట్ల రద్దు'తో ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఆ డేటాను తక్షణమే బహిరంగంగా ప్రచురించాలి..

ఫారమ్-6 నియమాలను అక్రమంగా మార్చి 'జెన్ జీ' యువతను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో చేసే మార్పుల డేటాను తక్షణమే బహిరంగంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓటర్లకు ముందస్తు సమాచారం ఇచ్చి అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. ఎన్నికల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూసిన చోట స్వతంత్ర విచారణ జరిపించాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy