సముద్రంలో సంచరించే ఒక ఆశ్చర్యకరమైన, అందమైన జీవి లీఫ్ షీప్. చూడటానికి యానిమేటెడ్ క్రియేచర్‌లా కనిపిస్తుంది. కానీ ఇది ఒక టైపు నత్త. దీని తల భాగం చూడడానికి చిన్న గొర్రె పిల్లలా ఉంటుంది.
అయితే శరీరంపై మాత్రం పచ్చని ఆకులు విచ్చుకున్నట్లు ఉంటాయి.
లీఫ్ షీప్ నత్తలు ఐదు మిల్లీమీటర్ల నుంచి సెంటిమీటరు మాత్రమే పెరుగుతాయి. మిగతా జలచరాల్లా కాకుండా... అచ్చంగా మొక్కల్లాగే కిరణజన్య సంయోగక్రియ జరుపుకొనే ఏకైక జీవి ఇది. సముద్రంలో నాచుని తిని... అందులోని క్లోరోప్లాస్ట్‌లను శరీరంలో దాచుకుంటుంది.
అంటే.. ఒకవైపు మొక్కలాగా, మరోవైపు జంతువులాగా కూడా శక్తిని పొందగలదన్నమాట. ఈ సముద్రజీవులు నీటిలో 33 అడుగుల లోతు కన్నా అడుగుకు వెళ్లవు. దీనికి కారణం సూర్యరశ్మిపై ఆధారపడే ఈ జీవి... ఆ వెలుగు ఉన్నంతవరకే ఈదుతుంది. వీటి జీవితకాలం ఆరు నెలల నుంచి రెండేళ్లు. విచిత్ర రూపంతో, ఆకర్షణీయంగా కనిపించే లీఫ్ షీప్‌లను పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ఎక్కువగా చూడొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:

