గురువారం అర్ధరాత్రికి పూర్తికానున్న స్కీమ్
వచ్చే ఆగస్టు 13 వరకు స్కీమ్ రెన్యువల్
33 లక్షల మంది రైతులకు 5 లక్షల బీమా
ఎల్‌ఐసీ కోసం 1,141 కోట్లు విడుదల
రెండేళ్లలో 32,267 కుటుంబాలకు
రూ.1613.35 కోట్ల సాయం
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రైతుబీమా పథకాన్ని మూడో ఏడాది కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా అమల్లో ఉన్న ఈ పథకం కాలపరిమితి ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో.. ఆగస్టు 14 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13 వరకు ఈ పథకాన్ని రెన్యూవల్ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో..
మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు: సింగిరెడ్డి
రాష్ట్రంలో రైతులు మోతాదుకు మించి ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని సెరికల్చర్ కార్యాలయంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఆయా కంపెనీలతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతాదుకు మించిన ఎరువుల మూలంగా నేల స్వభావం దెబ్బతింటోందని, తెగుళ్లతో పాటు పురుగుల బెడద ఎదురవుతుందన్నారు.

