ఖానాపూర్, మార్చి 7 : మండల కేంద్రంలో మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ముత్యాలపోచమ్మ ఆలయ వేడు కలు ఆదివారం తెల్లవారుజామున ముగిశా యి. చివరి రోజైన శనివారం రాత్రి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించారు. పట్టణం లోని పురవీధులలో అమ్మవారి సదర్‌బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. పట్ట ణంలోని పలు కాలనీల నుంచి అధిక సంఖ్య లో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిం చారు. వేడుకల ముగింపు సందర్భంగా శనివా రం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఆలయ ఆవరణలో జాతర నిర్వహిం చారు. దీంతో భక్తులు తరలిరావడంతో దుకా ణ సముదాయాలతో పాటు ఆలయ ప్రాంగ ణం కళకళలాడింది. దుకాణ సముదాయాల వద్ద చిన్నారుల సందడి కనిపించింది.

