Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు!

ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు!

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ట్రేడింగ్‌పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది.

ఇప్పటి వరకు హార్ధిక్‌ను ముంబై ట్రేడింగ్‌లోకి రిలీజ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా హార్దిక్‌ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబై భావిస్తోందని సమాచారం. పాండ్యను భర్తీ చేసే సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబై ఫ్రాంఛైజీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్‌ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నాడని, ఇప్పటికే మెనేజ్‌మెంట్‌తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పోటీలో సీనియర్‌ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అయితే, జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిలక్ వర్మ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హార్దిక్‌ను అసలు ట్రేడ్ చేయకపోయినా ఆశ్చర్యంలేదని ఫ్రాంఛైజీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడ్ విషయమై ఆటగాడితో చర్చలు కూడా జరిగాయని, ఒక ట్రేడ్ జరగాలంటే చాలా విషయాలు ఒక కొలిక్కి రావాలని, ఇది అంత తేలికైన విషయం కాదని ఎంఐ ఫ్రాంఛైజీలోని ఓ సభ్యుడు వెల్లడించారు.

అలానే మహేల జయవర్ధనెను కోచ్‌ పదవి నుంచి తప్పిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే సీజన్‌కు అతనే కోచ్‌గా ఉండే అవకాశముందని టాక్. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గతేడాది మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ అతడిని వదులుకునేందుకు ముంబై సిద్ధంగా లేదని సమాచారం.

strong>

ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు: ప్రధాని మోదీ

ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy