Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైని దాటి ఆలోచించడు!

ముంబైని దాటి ఆలోచించడు!

మంజ్రేకర్‌పై భగ్గుమన్న శ్రీకాంత్‌

టెస్ట్‌లకు రాహుల్‌ ఎంపికపై వివాదం

చెన్నై: ఐపీఎల్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తోపాటు చక్కటి కెప్టెన్సీతో ప్రశంసలందుకుంటున్న కేఎల్‌ రాహుల్‌ను ఆస్ర్టేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుకు ఎంపిక చేశారు. అయితే కేఎల్‌ను టెస్ట్‌ జట్టుకు ఎంపిక చేయడాన్ని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తప్పుబట్టాడు. అతడి సెలెక్షన్‌ రంజీ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డాడు. మంజేక్రర్‌ వ్యాఖ్యలపై సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ భగ్గుమన్నాడు. రాహుల్‌ ఎంపికపై మంజ్రేకర్‌ స్పందిస్తూ..'ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా ఓ క్రికెటర్‌కు టెస్ట్‌ జట్టులో మళ్లీ చోటు కల్పించి చెడు సంప్రదాయానికి నాంది పలికారు' అని ట్విటర్‌లో విమర్శలు గుప్పించాడు.

ఈ విమర్శలను శ్రీకాంత్‌ ఖండించాడు. 'పనీపాటాలేని మంజ్రేకర్‌ను వదిలేయండి. అతడు ముంబై పరిధిని దాటి ఆలోచించలేడు. వివాదం చేయడంతప్ప అది మరొకటి కాదు. రాహుల్‌ అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడాడు. అతడి టెస్ట్‌ రికార్డులను పరిశీలించండి' అని శ్రీకాంత్‌ సూచించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy