Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంచుకొస్తున్న భారీ ఆహార సంక్షోభం.. ప్రపంచానికి  జైశంకర్ హెచ్చరిక..

ముంచుకొస్తున్న భారీ ఆహార సంక్షోభం.. ప్రపంచానికి జైశంకర్ హెచ్చరిక..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక హెచ్చరిక చేశారు. రానున్న నెలల్లో ప్రపంచం భారీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ధాన్యాల రవాణాలో అంతరాయాలు, ఎరువుల కొరత, ఇంధన సరఫరాలపై ఒత్తిడి, అంతర్జాతీయ ఘర్షణలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయని తెలిపారు (S Jaishankar global food crisis).

న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్.. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక వ్యవస్థ అనే నాలుగు అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ పరిణామాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వివరించారు. ప్రపంచంలో ఇప్పటికే ఎరువుల సరఫరాలో గణనీయమైన కొరత కనిపిస్తోందని జైశంకర్ తెలిపారు. అదే సమయంలో కొన్ని కీలక ధాన్య ఎగుమతి దేశాల నుంచి సరుకుల రవాణాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పారు (food crisis 2026).

ముఖ్యంగా నల్ల సముద్ర ప్రాంతంలోని పరిస్థితులు ధాన్యాల సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. ఈ పరిస్థితులన్నింటినీ ప్రస్తావిస్తూ రానున్న నెలల్లో భారీ ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని జైశంకర్ హెచ్చరించారు. అయితే ఇది ఇప్పటికే ఏర్పడిన సంక్షోభం కాదని, ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే ఎదురయ్యే ప్రమాదంగా ఆయన పేర్కొన్నారు (fertiliser shortage).

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-గల్ఫ్ ప్రాంతంలోని ఉద్రిక్తతలు వాటి పరిధిని దాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని జైశంకర్ అన్నారు (Jaishankar warning). ధాన్యాలు, ఇంధనం, ఎరువుల సరఫరా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడితే.. వాటి ప్రభావం దూరంగా ఉన్న దేశాలపై కూడా పడుతుందని వివరించారు. ప్రపంచ ఆహార సరఫరాలో కీలకమైన ప్రాంతాల్లో రవాణా సమస్యలు ఏర్పడితే దిగుమతులపై ఆధారపడే దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది. రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం ద్వారా ఆహార ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.


ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్

సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy