Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముందస్తు అప్రమత్తతే ముఖ్యం

ముందస్తు అప్రమత్తతే ముఖ్యం

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరాలబారిన పడ కుండా ఉండేందుకు అప్రమత్తతే ముఖ్యమని ఎస్పీ మహేష్‌ బి. గితే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కళాశాలలో తెలంగాణ సైబ ర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) జిల్లా సైబర్‌ టీం ఆధ్వర్యంలో సైబర్‌ నేరాల నివారణపై విద్యార్థు లకు అవగాహనసదస్సు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా ఎస్పీ మహేష్‌ బి. గితే హాజరయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరస్థులు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొం దించుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని సోషల్‌ మీడియా ద్వారా నకిలీఅకౌంట్లు, ఫేక్‌లింకులు, పార్ట్‌ టైం ఉద్యో గాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్‌ ఆఫర్లు, లక్కీడ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని పేర్కొ న్నారు.

తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, వీడియోకాల్స్‌, సందేశాలు, లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, సీవీవీనెంబర్‌, ఆధార్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం అత్యవసర పరి స్థితులను ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరస్థులు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదు వుతోపాటు సైబర్‌ నేరాలపై అవగాహన పెం పొందించుకొని కుటుంబ సభ్యులు, స్నేహితుల కు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించాల న్నారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే భయభ్రాంతులకు గురి కాకుండా 1930కు కాల్‌ చేయాలని, లేదా నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదుచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎస్పీ వినాయకు డి బోధనలతో సైబర్‌ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా సైబర్‌ సెల్‌ టీం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సైబర్‌నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్‌, సైబర్‌ క్రైం ఎస్‌ఐ జునేదు, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అనిత తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy