Dailyhunt
మునిసిపల్‌ ఎన్నికల్లో 61 శాతం స్థానాల్లో బీసీల పాగా

మునిసిపల్‌ ఎన్నికల్లో 61 శాతం స్థానాల్లో బీసీల పాగా

  • సామాజిక చైతన్యానికి ఇదే నిదర్శనం: బీసీ కమిషన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో బీసీలు 61 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ హర్షం వ్యక్తం చేసింది.

ఈ మేరకు కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి రంగు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బీసీలకు మునిసిపాలిటీల్లో 28.22ు, కార్పొరేషన్లలో 35.25ు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ జనరల్‌ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులు భారీగా గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ 52.76ు మంది బీసీలు గెలిచారని, రిజర్వేషన్లకు అతీతంగా బీసీ వర్గాల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యమే ఈ విజయాలకు కారణమని కమిషన్‌ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy