Dailyhunt
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

మ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఎంపీ స్వాతి మాలివాల్.. కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను 2006 నుంచి కేజ్రీవాల్, ఆయన పార్టీతో కలిసి పనిచేస్తున్నానని, అన్ని ఉద్యమాల్లోనూ చురుకుగా పాల్గొన్నానని చెప్పారు.

అయితే ఒక సందర్భంలో తన సొంత ఇంట్లోనే తనను ఒక గూండాతో కేజ్రీవాల్ కొట్టించారని ఆరోపించారు. ఆ ఘటనపై తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కూడా కేజ్రీవాల్ ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. అదేవిధంగా, పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశాన్ని కూడా తనకు ఇవ్వలేదని విమర్శించారు (Swati Maliwal allegations).

శుక్రవారం నాడు ఆప్‌నకు చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. స్వాతి మాలివాల్‌తో పాటు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, విక్రమ్ సింగ్ సాహ్నీ, రాజేందర్ గుప్తా బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే బీజేపీలో చేరానని స్వాతి మాలివాల్ శనివారం అన్నారు. కేజ్రీవాల్ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. గత రెండేళ్లుగా పార్లమెంటులో మాట్లాడేందుకు తనకు పార్టీ అవకాశం ఇవ్వలేదని అన్నారు (Arvind Kejriwal assault row).

భద్రతా చర్యలు, నక్సలిజంపై చర్యలు, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం వంటి కీలక నిర్ణయాలను ఉటంకిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోదీ అని స్వాతి ప్రశంసించారు (AAP crisis 2026). ప్రధాన జాతీయ విధానాలను రూపొందించడంలో హోం మంత్రి అమిత్ షా పాత్రను కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. బీజేపీలో చేరాలని తాను స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నానని, మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు.

strong>

కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..

ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy