Dailyhunt
నాదే బాధ్యత.. సారీ చెప్పిన ప్రధాని

నాదే బాధ్యత.. సారీ చెప్పిన ప్రధాని

లండన్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దేశాల్లో బ్రిటన్‌ ఒకటి. ఇక్కడ సంభవించిన కరోనా మరణాల సంఖ్య మంగళవారమే లక్ష మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,04,000 మంది కరోనాకు బలైనట్లు యూకే ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో అమెరికా, బ్రెజిల్, భారత్ తర్వాత అత్యధిక కరోనా మరణాలు సంభవించిన నాలుగో దేశంగా బ్రిటన్ నిలిచింది. కాగా, గతేడాది డిసెంబర్‌లో ఈ దేశంలో ఒక్కసారిగా మరణాలు పెరిగాయి. ఇక్కడి కరోనా మృతుల్లో అత్యధికంగా వృద్ధులే ఉండటం గమనార్హం.

బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ కరోనా వెలుగు చూసిన తర్వాత కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. అందుకే యూకే మూడోసారి లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో ఓ స్థానిక పత్రికతో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్..

ఈ కరోనా మరణాలకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు వెల్లడించారు. ''దేశం కోల్పోయిన ప్రతి ప్రాణం నన్ను కలవరపరిచింది. ఐయామ్ డీప్లీ సారీ.. ఓ ప్రధానిగా ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యకూ నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నా'' అని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy