Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాడు యాసిడ్‌ దాడి బాధితుడు నేడు 'కాంగో' హీరో

నాడు యాసిడ్‌ దాడి బాధితుడు నేడు 'కాంగో' హీరో

క్రిస్టియానో రొనాల్డో లాంటి ఆటగాడు ఉన్న పోర్చుగల్‌పై చరిత్రాత్మక గోల్‌ కొట్టి ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు డిఆర్‌ కాంగో ఆటగాడు యోవానే విస్సా.

ఐదేళ్ల క్రితం యాసిడ్‌ దాడిలో కంటిచూపు కోల్పోయి దాదాపు కెరీర్‌ ముగిసిందనుకున్న దశ నుంచి ఇప్పుడు ఆ జట్టు ఆశాదీపంగా మారిన 29 ఏళ్ల విస్సా జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం. 2021 జులైలో ఓ మహిళ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలన్న నెపంతో విస్సా ఇంటికి వచ్చి అతడి మొహంపై యాసిడ్‌ పోసింది. ఈ ఘటనలో అతడు రెండుకళ్లు కోల్పోయే పరిస్థితి తలెత్తగా, అనేక సర్జరీల అనంతరం వైద్యులు అతని కంటిచూపును కాపాడారు. అయితే, విస్సా కూతురును కిడ్నాప్‌ చేయడంలో భాగంగా ఆ మహిళ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన ఆ మహిళకు కోర్టు 18 ఏళ్ల జైలుశిక్ష కూడా విధించింది. ఈ దాడి కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన విస్సా.. ఆ ఘటన నుంచి కోలుకొన్న తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. తనదైన ప్రతిభతో క్లబ్‌ స్థాయిలో అదరగొడుతూ, అంతర్జాతీయస్థాయిలో తన దేశ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవీ చదవండి:

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy