Dailyhunt
నాగర్ కర్నూల్ జిల్లా: మానవత్వాన్ని చాటిన సర్పంచ్‌

నాగర్ కర్నూల్ జిల్లా: మానవత్వాన్ని చాటిన సర్పంచ్‌

నాగర్ కర్నూల్ జిల్లా: కోడేర్ మండలం, నాగుల పల్లి గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామ సర్పంచ్ వెంకట స్వామి, గ్రామ పంచాయతీ సిబ్బంది, పోలీసులు మానవత్వాన్ని చాటారు. కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామపంచాయతీ సిబ్బంది, పోలీసులు పీపీఈ కిట్లు ధరించి, జేసీబీ సహాయంతో గుంతతీసి పూడ్చిపెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy