ఆళ్లగడ్డ, మార్చి 6: ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో 22వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉషారాణి నామినేషన్ వేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో ఆమె నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆ వార్డుకు చెందిన కొంతమంది మహిళలు శనివారం పాతబస్టాండు వద్ద బైఠాయించారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లారు. ఆమె నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో ఓటు వేయలేక పోతున్నామని కమిషనర్‌కు విన్నవించుకున్నారు. తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.
