Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి

- గ్వాలియర్‌ యూనివర్శిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ఎస్‌కే రావు

పాలమూరు, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి) : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించా లని, తద్వారా అధిక దిగుబడులు సాధించి, రైతులు మెరుగైన ఆదాయం పొందుతారని గ్వాలియర్‌ యూనివర్శిటీ మాజీ వైస్‌ చాన్స్‌ లర్‌ ఎస్‌కే రావు అన్నారు.

ప్రాథమిక వ్యవ సాయ సహకార పరపతి సంఘాల నుంచి విత్తనాల సరఫరా, ప్రాజెక్టుల అమలు తీరు పై మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ఆడిటోరియంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎస్‌కే రావు మాట్లాడుతూ పీఏసీ ఎస్‌లు విత్తనోత్పత్తిని స్థిరమైన, లాభదాయ కమైన వ్యాపారంగా చేపట్టేందుకు అవకా శాలు ఉన్నాయని తెలిపారు. రైతులు లాభదాయకమైన విత్తనాలను ఎంపిక చేసుకో వాలన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా నాణ్యమైన విత్తనోత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిం చారు.

విత్తన ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులు, నాణ్యత, ప్రాసెసింగ్‌, నిల్వ, సకాలంలో విత్తనాల పంపిణీ తదితర అంశాలను వివరించారు. ప్రాజెక్టుల అమలు, పీఏసీఎల్‌ల బాధ్యత, వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ విద్యాధర్‌ వివరించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌, పాలెం ఏడీఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్‌ కృష్ణ మాట్లాడుతూ విత్తనోత్పత్తిలో శాస్త్రీయ సాం కేతిక పరిజ్ఞానం, నిపుణుల సాంకేతిక సూచనల ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్ర మంలో డీసీసీబీ సీఈవో మహమ్మద్‌ షఫీఉల్లాఖాన్‌, నాబార్డ్‌ డీడీఎం షణ్ముఖాచారి, నాబార్డ్‌ నారాయణపేట డీడీఎం మహేందర్‌, జిల్లా సహకార అధికారి కృష్ణ, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల డీసీవోలతో పాటు రఘునాథరావు, ఐదు జిల్లాలకు చెందిన పీఏసీఎల్‌ల సీఈవోలు, ప్రతినిధులు, 50 మంది రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy