Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్టార్ పేసర్ బుమ్రా గాయపడటంతో అతడి స్థానంలో యువ ప్లేయర్ ఆకిబ్ నబిని టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది.

సీనియర్ ప్లేయర్ మహ్మద్ షమీని కాదని.. నబికి అవకాశం ఇవ్వడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇదే క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా స్థానంలో నబిని తీసుకోవడంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'జమ్ముకశ్మీర్ యువ ప్లేయర్ ఆకిబ్ నబి విషయంలో నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది. గత రంజీ సీజన్‌లో 60 వికెట్లు తీసి జమ్ముకశ్మీర్‌కు తొలి టైటిల్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అలాంటి ప్లేయర్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకోవడం నాకు నచ్చలేదు. నబి లాంటి ప్రతిభ ఉన్న ఆటగాడు జట్టులో స్థానం దక్కించుకోవాలి. కానీ జట్టులో సీనియర్ ప్లేయర్ గాయపడటం వల్ల అతడికి అవకాశం రావడం నాకు నచ్చలేదు. నబినీ ఎప్పుడో జట్టులో ఎంపిక చేసి ఉంటే బాగుండేది. అయినప్పటికీ ఆలస్యమైనా అవకాశం వచ్చినందుకు సంతోషమే' అని వసీం జాఫర్ వెల్లడించాడు.

నేటి(శుక్రవారం) నుంచి లంక ఎలెవన్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నబి నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల ఇండియా-ఏ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఈ ఎంపికతో జమ్ముకశ్మీర్ నుంచి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా నబి చరిత్ర సృష్టించాడు.

strong>

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy