నల్గొండ: పీఏపల్లి మండలం అంగడిపేటలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. మృతులు చింతబావికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఎదురుగా వస్తున్న బోలెరోను తప్పించబోయి లారీ-ఆటో ఢీకొన్నాయి. ప్రమాదస్థలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదతీవ్రతను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

